1 00:00:11,678 --> 00:00:15,182 డేవిడ్ అటెన్బరో సమర్పణ 2 00:00:16,517 --> 00:00:21,563 భూమి మీద ఇప్పటివరకూ జీవించిన జీవరాశులలో ఖచ్చితంగా అత్యంత ప్రత్యేకమైనదీ, 3 00:00:22,105 --> 00:00:26,318 అత్యంత ప్రముఖమైనదీ, డైనోసార్. 4 00:00:27,361 --> 00:00:29,613 టైరనోసారస్ రెక్స్. 5 00:00:30,656 --> 00:00:35,202 ఈ జంతువు మన అందరిలోనూ ఒక ఊహను ప్రేరేపించగలదు. 6 00:00:35,285 --> 00:00:38,247 ఇది ఏ రకమైన జంతువు? 7 00:00:38,330 --> 00:00:41,542 అది ఎలా ఉండేది? ఎలా జీవించేది? 8 00:00:41,625 --> 00:00:45,587 ఇప్పుడు, శాస్త్రీయ పరిశోధనలు ఈ ప్రశ్నలకు సమాధానాలు అందిస్తున్నాయి. 9 00:00:45,671 --> 00:00:47,923 అవి కేవలం టి. రెక్స్ కి సంబంధించి మాత్రమే కాదు, 10 00:00:48,006 --> 00:00:51,343 దానితో పాటు జీవించిన ఇతర జీవరాశుల గురించి కూడా తెలియజేస్తున్నాయి. 11 00:00:51,426 --> 00:00:58,016 వాటిని సజీవంగా దర్శించడానికి ఆధునికమైన ఇమేజింగ్ టెక్నాలజీ ఉపయోగపడుతోంది. 12 00:01:01,436 --> 00:01:05,440 భూగ్రహం, 66 మిలియన్ సంవత్సరాల క్రితం. 13 00:01:13,949 --> 00:01:17,494 ఆకాశం అంతా భారీ పక్షులతో నిండిపోయింది. 14 00:01:20,038 --> 00:01:24,084 సముద్రాలలో, రాక్షస సరీసృపాలు అగాథాల అంచుల వరకూ పహారా కాస్తున్నాయి. 15 00:01:26,128 --> 00:01:29,256 ఇక భూమి మీద, అన్ని జాతుల డైనోసార్లు, 16 00:01:30,465 --> 00:01:33,218 మనుగడ సాగించడానికి పోరాటం చేస్తున్నాయి. 17 00:01:39,391 --> 00:01:45,689 డైనోసార్లు రాజ్యం ఏలిన ఈ ప్రపంచం గురించి మనకి ఇప్పుడు చాలా విషయాలు తెలుసు. 18 00:01:49,651 --> 00:01:52,196 ఇది వాటి గురించిన కథ. 19 00:02:04,374 --> 00:02:09,922 మంచు ప్రపంచాలు 20 00:02:13,509 --> 00:02:15,719 భూగ్రహం ఉత్తరపు అంచుల్లోనూ, దక్షిణపు అంచుల్లోనూ 21 00:02:15,802 --> 00:02:19,765 జీవితం అత్యంత కఠినంగా ఉంటుంది. 22 00:02:22,476 --> 00:02:27,898 అయితే, ఈ ధ్రువ ప్రాంతాలను డైనోసార్స్ స్థావరాలుగా మార్చుకోగలిగాయి. 23 00:02:30,442 --> 00:02:35,322 అమెరికా ఉత్తరపు అంచుల్లో, ఈ చిన్న వేట జంతువు, డ్రోమియోసార్, 24 00:02:35,405 --> 00:02:39,826 సుమారు మూడు నెలల పాటు పూర్తి చీకటి రోజులను తట్టుకోగలిగింది. 25 00:02:41,453 --> 00:02:44,790 అయితే ఇప్పుడు ఎట్టకేలకు వసంతం రానే వచ్చింది. 26 00:02:53,090 --> 00:02:55,342 ఈ జంతువు శరీరం ఈకలతో కప్పి ఉంటుంది, 27 00:02:55,425 --> 00:02:58,011 అందువల్ల ఇది తన శరీరానికి తగినంత ఉష్ణోగ్రతని అందించుకోగలుగుతుంది 28 00:02:58,095 --> 00:03:00,097 ఇంకా వీలైనంత వరకూ ఆ వేడిని కాపాడుకోవలసి ఉంటుంది. 29 00:03:01,932 --> 00:03:06,270 ఈ శీతల అక్షాంశాలలో అన్ని జాతుల డైనోసార్స్ కి ఇదే పెద్ద సవాలు. 30 00:03:10,148 --> 00:03:12,943 డ్రోమియోసార్ మంచు ఉపరితలం మీద వేగంగా కదులుతూ, 31 00:03:13,026 --> 00:03:17,364 గతంలో తనకు ఆహారం లభించిన ప్రదేశాలలో మళ్లీ తనిఖీలు చేస్తుంది. 32 00:03:21,159 --> 00:03:26,790 ఈ మంచు ప్రపంచంలో, ఏ అవకాశమూ విస్మరించేంత చిన్నది కాదు 33 00:03:35,632 --> 00:03:38,635 కోరుకున్నది దక్కించుకోవాలంటే, సాధారణంగా, మనకు మంచి సమయస్ఫూర్తి... 34 00:03:38,719 --> 00:03:44,016 అవసరం. 35 00:03:50,814 --> 00:03:52,983 భూమి చరిత్రలో మనం చర్చించుకునే కాలమానంలో, 36 00:03:53,066 --> 00:03:55,903 ధ్రువ ప్రాంతాలు ఇప్పటికంటే వెచ్చగా ఉండేవి, 37 00:03:56,486 --> 00:04:02,910 అయితే, ఈ ప్రదేశాలలో రుతువుల మార్పులు మాత్రం విపరీతంగా ఉండేవి. 38 00:04:06,747 --> 00:04:10,417 దాదాపు మూడు నెలల తరువాత సూర్యుడు మొదటిసారి ఇక్కడ ఉదయించినప్పుడు, 39 00:04:12,586 --> 00:04:16,507 పగటి వేళ వీలైనంత వరకూ ఆహారాన్ని సంపాదించుకోవడానికి ప్రతి జంతువు సంసిద్ధంగా ఉండాలి 40 00:04:17,216 --> 00:04:19,343 అలాగే రాబోయే వెచ్చని రోజుల కోసం కూడా వేటకు తయారవ్వాలి. 41 00:04:24,681 --> 00:04:27,017 ఈ చిన్ని డ్రోమియోసార్స్ గనుక పెద్ద జంతువులను వేటాడాలంటే, 42 00:04:28,101 --> 00:04:30,896 అవి కలసికట్టుగా ప్రయత్నించక తప్పదు. 43 00:04:35,734 --> 00:04:38,278 వాటికి ఈ రుతువులో తొలి అవకాశం ఇదిగో ఇలా వస్తోంది. 44 00:04:40,280 --> 00:04:42,824 హెడ్రోసార్స్ గుంపు. 45 00:04:45,619 --> 00:04:49,331 ప్రతి సంవత్సరం ఈ బాతు ముక్కు డైనోసార్స్ ఈ ప్రాంతం గుండా ప్రయాణిస్తాయి. 46 00:04:51,834 --> 00:04:56,046 వసంత రుతువులో వచ్చే తాజా పచ్చదనం కోసం అన్వేషిస్తూ తిరిగే సంచారజాతి జంతువులు ఇవి. 47 00:05:06,557 --> 00:05:08,058 అవి భారీ జంతువులు. 48 00:05:08,141 --> 00:05:12,479 కలసికట్టుగా ప్రయత్నిస్తే తప్ప డ్రోమియోసార్స్ కి వేటాడే అవకాశం ఉండదు. 49 00:05:19,069 --> 00:05:22,948 ఇక్కడ ఒక నది ప్రవహిస్తోంది, దీనిని ఈ గుంపు దాటవలసి ఉంది. 50 00:05:37,171 --> 00:05:40,757 వీటిలో కొన్ని జంతువులు నదిని ఎప్పటికీ దాటలేవని డ్రోమియోసార్స్ కి తెలుసు. 51 00:05:59,109 --> 00:06:04,865 చలికాలం తన పట్టు వదిలిపెట్టడంతో, మంచు కరిగిన నీరు గొప్ప వేగంతో ప్రవహిస్తోంది. 52 00:06:08,577 --> 00:06:12,915 ఈ లోతయిన, వేగంగా ప్రవహించే నదిని ఈ జంతువుల గుంపు దాటాలి. 53 00:06:15,959 --> 00:06:18,795 ఈ బృందం సారథులు తమ గుంపు క్షేమంగా నదిని దాటడానికి మంచి చోటుని ఎంపిక చేస్తున్నారు. 54 00:06:27,137 --> 00:06:29,598 మిగతా జంతువులు జాగ్రత్తగా వాటిని అనుసరిస్తున్నాయి. 55 00:06:31,850 --> 00:06:34,728 పసికూనలు తమ తల్లిదండ్రులకు చేరువగా నడుస్తున్నాయి. 56 00:06:35,979 --> 00:06:39,066 ఇక్కడ ఒక్క తప్పటడుగు పడిందో వాటి ప్రాణాలకే ప్రమాదం కావచ్చు. 57 00:06:41,985 --> 00:06:45,906 తమ వంతు కోసం వేచి ఉన్న పెద్ద జంతువుల్లో క్రమంగా అసహనం పెరుగుతోంది. 58 00:06:46,698 --> 00:06:49,952 ఈ కురచ ప్రదేశమే డ్రోమియోసార్స్ కి ఒక అవకాశాన్ని అందిస్తుంది. 59 00:07:03,632 --> 00:07:05,801 డ్రోమియోసార్స్ లక్ష్యం పసికూనలే. 60 00:07:18,480 --> 00:07:20,983 ఈ గుంపులో ఒక్కసారిగా భయాందోళనలు ఏర్పడుతున్నాయి. 61 00:07:27,948 --> 00:07:32,244 ఒక క్రమపద్ధతిలో నదిని దాటవలసి ఉండగా అది ఒక్కసారిగా గందరగోళంగా మారిపోయింది. 62 00:07:37,583 --> 00:07:40,210 తల్లిదండ్రులు ఇంకా వాటి పిల్లలు వేరు పడ్డారు. 63 00:08:19,249 --> 00:08:20,876 అదృష్టవశాత్తూ తప్పించుకుంది. 64 00:08:26,298 --> 00:08:30,802 ఈ గుంపు మళ్లీ ఒకటిగా గుమిగూడి తమ ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. 65 00:08:34,556 --> 00:08:38,018 డ్రోమియోసార్స్ తమకు వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకున్నాయి... 66 00:08:40,354 --> 00:08:43,232 కానీ అవి చేయవలసిన పనిని ఆ నది చేసిపెట్టింది. 67 00:08:45,567 --> 00:08:47,569 నది దాటే సమయంలో ఎప్పుడూ కొన్ని మరణాలు సంభవిస్తాయి. 68 00:08:49,238 --> 00:08:54,284 అది ఆ జంతువులకు విందు. ఈ వేట జంతువులు ఈ శీతాకాలం అంతా వేటాడినా కూడా దొరకనంత ఆహారం. 69 00:09:02,918 --> 00:09:07,089 ఈ మంచు ప్రపంచంలో, రుతువులు అందించే అవకాశాలు తాత్కాలికమైనవి. 70 00:09:07,589 --> 00:09:11,343 వసంతం కొద్దికాలమే ఉంటుంది, ఆ తరువాత వేసవి కాలం త్వరగా ముగిసిపోతుంది. 71 00:09:13,595 --> 00:09:17,933 శీతాకాలపు సవాళ్లు మళ్లీ వచ్చేలోగా ఇక్కడి జంతువులు చాలా చేయవలసి ఉంటుంది. 72 00:09:24,648 --> 00:09:29,027 దిగువ ప్రాంతంలో, నదులు విశాలమై క్రమంగా నిదానిస్తాయి, 73 00:09:29,111 --> 00:09:32,531 అవి టన్నుల కొద్దీ ఇసుకను అక్కడికి తరలిస్తాయి, 74 00:09:32,614 --> 00:09:35,367 దానితో కొన్ని ద్వీపాల సమాహారం పైకి తేలుతుంది. 75 00:09:39,454 --> 00:09:42,207 ఈ అవకాశాన్ని కొన్ని జంతువులు ఇప్పటికే సద్వినియోగం చేసుకుని 76 00:09:42,291 --> 00:09:45,210 వసంత వేడుకలకు హాజరవ్వడానికి సిద్ధమయ్యాయి. 77 00:09:49,381 --> 00:09:52,843 వసంతం, ఎట్టకేలకు, నిజంగా రానే వచ్చింది. 78 00:09:59,057 --> 00:10:02,728 డజన్ల కొద్దీ మగ ఓర్నిథోమైమస్ జంతువులు 79 00:10:02,811 --> 00:10:05,355 ఆ సంవత్సరపు అతి ముఖ్యమైన ఘటనకు సమాయత్తం అవుతున్నాయి. 80 00:10:08,108 --> 00:10:13,447 ఈ విచిత్రమైన నిప్పుకోడిలా కనిపించే డైనోసార్స్ గూళ్లు కట్టుకునే ప్రక్రియలో భాగంగా 81 00:10:13,530 --> 00:10:19,244 సురక్షితమైన ప్రదేశాలను ఎంచుకుని చిన్న చిన్న గోతులు తవ్వుతుంటాయి. 82 00:10:23,582 --> 00:10:25,083 ఆడ ఓర్నిథోమైమస్ అక్కడికి వచ్చాక, 83 00:10:25,167 --> 00:10:29,421 వాటిల్లో ఎవరు బాగా మంచి గూడు కట్టారో వారిని తన జోడీగా ఎంచుకుంటుంది. 84 00:10:40,307 --> 00:10:44,811 ఆలస్యంగా వచ్చిన మగ జంతువులకు ఆ ప్రదేశంలో ఖాళీ దొరకదు. 85 00:10:53,570 --> 00:10:56,782 అంతో ఇంతో ఖాళీ ప్రదేశం ఆ ద్వీపం అంచున మాత్రమే దొరుకుతుంది. 86 00:10:59,535 --> 00:11:02,955 ఖాళీ ప్రదేశం దొరకడం అనేది గూడు కట్టడానికి ప్రారంభ దశ మాత్రమే. 87 00:11:08,293 --> 00:11:10,420 ఆడ జంతువులు గుడ్లు పెట్టినప్పుడు, 88 00:11:10,504 --> 00:11:13,924 ఆ గూళ్లలో మెత్తని గడ్డి ఇంకా ఆకులు పరిచి గుడ్లను వెచ్చగా ఉంచాలి. 89 00:11:25,519 --> 00:11:29,231 గూడు కట్టడానికి తగిన సామగ్రి దొరకడం అంత తేలికైన పని కాదు... 90 00:11:32,484 --> 00:11:36,655 అందుకే కొన్ని ఓర్నిథోమైమస్ జంతువులు దొంగతనానికి సిద్ధం అవుతాయి. 91 00:11:51,795 --> 00:11:54,381 ఆలస్యంగా రావడంలో ఉన్న సదవకాశం ఏమిటంటే 92 00:11:54,464 --> 00:11:57,342 కొన్ని మగ జంతువులు అప్పటికే కష్టపడి చక్కని గూళ్లు కట్టుకుని ఉంటాయి. 93 00:12:26,538 --> 00:12:30,667 ఎటువంటి కాపలా లేని గూడు ఆ దొంగ జంతువు దృష్టిని ఆకర్షిస్తుంది. 94 00:12:34,171 --> 00:12:37,633 ఇటువంటి వలస స్థావరాలలో, దొంగతనం అనేది చాలా మామూలు విషయం 95 00:12:38,133 --> 00:12:41,637 ఎందుకంటే ఒకసారో మరో సందర్భంలోనో గూడుకు ఉపయోగించిన సామగ్రి, 96 00:12:41,720 --> 00:12:44,973 ఆ ద్వీపంలో ఏదో ఒక గూడులోకి దొంగతనంగా చేరిపోతుంటుంది. 97 00:12:46,475 --> 00:12:48,352 కానీ ఇక్కడ దొంగతనం కూడా ప్రమాదకరమైనదే. 98 00:12:53,106 --> 00:12:54,191 దొంగ దొరికిపోయింది. 99 00:13:01,740 --> 00:13:04,451 హెడ్రోసార్స్ జంట ఒకటి ఆ చుట్టుపక్కల తిరుగుతోంది. 100 00:13:07,871 --> 00:13:10,415 అవి ఆకుల్ని తినేస్తాయి. 101 00:13:12,459 --> 00:13:15,671 కాబట్టి, ఈ మగ జంతువులు తమ ఆస్తుల్ని రక్షించుకోవడానికి పోరాడాలి. 102 00:13:22,886 --> 00:13:27,182 గూడు కట్టుకునే నైపుణ్యం రావాలంటే అందుకు కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు. 103 00:13:29,393 --> 00:13:33,438 కానీ గెలుపు దక్కాలంటే అనుభవం ఒక్కటే సరిపోదు. 104 00:13:39,152 --> 00:13:43,365 రద్దీ స్థావరంలో, ఎవరో ఒకరు బలి కాక తప్పదు. 105 00:13:54,293 --> 00:13:58,672 ఓర్నిథోమైమస్ జంతువులకు, ఈ నదీ ద్వీపాలు అభయారణ్యంలా ఉపయోగపడి 106 00:13:58,755 --> 00:14:02,092 గుడ్లు పెట్టడానికి ఇంకా అవి పొదిగిన తరువాత బయటకొచ్చే పిల్లలు క్షేమంగా ఉండటానికీ తోడ్పడతాయి. 107 00:14:07,764 --> 00:14:13,061 మరింత ఉత్తర దిక్కులో, ఉష్ణోగ్రతలు తగ్గిపోయి పరిస్థితులు కఠినంగా మారుతున్నాయి. 108 00:14:14,271 --> 00:14:18,442 నెత్తిన శిఖరం గల భారీ హెడ్రోసార్స్ ఒక నిర్దిష్టమైన చోట చక్కని అవకాశాన్ని పసిగట్టి 109 00:14:19,026 --> 00:14:21,904 ఆ దిశగా ప్రయాణమయ్యాయి. 110 00:14:22,738 --> 00:14:25,240 ఆ ప్రదేశం వాటికి ఒక ప్రత్యేకమైనది అందిస్తుంది. 111 00:14:30,996 --> 00:14:35,334 ఈ డైనోసార్స్ కి ఉండే పొడవైన మెడలు ప్రత్యేకంగా సొగసుగా ఉండటం వల్ల 112 00:14:35,417 --> 00:14:36,710 వాటికి ఆ పేరు వచ్చింది. 113 00:14:39,338 --> 00:14:42,257 ఒలొరోటైటన్, "భారీ హంస." 114 00:14:44,092 --> 00:14:48,388 వాటి నెత్తి మీద కొప్పు మాదిరిగా ఉండే శిఖరాలు డొల్లగా ఉండి అవి చేసే శబ్దాలను పెద్దగా చేస్తాయి. 115 00:15:03,028 --> 00:15:07,449 ప్రపంచంలోనే అతి పెద్ద అగ్నిపర్వత శ్రేణులలో ఒక దాని వైపు ఈ జంతువులు సాగుతున్నాయి, 116 00:15:17,251 --> 00:15:20,128 అది ప్రమాదకరమైన ఇంకా ప్రాణాంతకమైన ప్రదేశం. 117 00:15:32,975 --> 00:15:37,354 కానీ ఇక్కడికి ఒలొరోటైటన్స్ ప్రతి సంవత్సరం తిరిగి వస్తూనే ఉంటాయి... 118 00:15:39,565 --> 00:15:44,653 ఎందుకంటే అగ్నిపర్వతాలు ఆ నేలను ఎప్పుడూ వేడిగా ఉండేలా చేస్తాయి. 119 00:15:53,579 --> 00:15:55,956 కాబట్టి, అవి ఇక్కడ గుడ్లు పెడతాయి. 120 00:16:26,486 --> 00:16:32,159 ఈ వెచ్చని అగ్నిపర్వతపు మట్టి వాటి గుడ్లకు ఇంక్యుబేటర్ లా పని చేస్తుంది. 121 00:16:35,829 --> 00:16:41,502 ఈ గుంపు ఇక్కడికి చేరుకున్న కొద్ది వారాలకు, ఆ గుడ్లు పొదుగుతాయి. 122 00:16:56,767 --> 00:17:00,062 హెడ్రోసార్స్ తమ పిల్లలను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాయి. 123 00:17:05,192 --> 00:17:08,362 తమ పిల్లలు తినడానికి ఈ హెడ్రోసార్స్ నోటి నిండా ఆకులు కరుచుకుని తెస్తాయి. 124 00:17:13,700 --> 00:17:17,079 ప్రతి గూడులో సుమారు ఇరవైకి పైగా పసికూనలు ఉంటాయి. 125 00:17:30,342 --> 00:17:35,222 ఇక్కడ తక్కువ సమయం ఉండే వేసవి కాలంలో ఈ పిల్లలు పుట్టుకొచ్చాయి. 126 00:17:37,099 --> 00:17:40,602 దాదాపు కొద్ది వారాల పాటు సూర్యుడు అస్తమించని ఆ ప్రదేశంలో 127 00:17:41,603 --> 00:17:44,356 గుర్రపుతోక మొక్కలు వేగంగా పెరిగి 128 00:17:44,439 --> 00:17:48,068 ఆ మొత్తం గుంపుకు సమృద్ధిగా ఆహారాన్ని అందించగలుగుతాయి. 129 00:17:50,237 --> 00:17:55,117 పచ్చ గడ్డి కన్నా ఈ మొక్కల్లో పోషక విలువలు ఎక్కువ ఉంటాయి. 130 00:18:00,038 --> 00:18:04,459 సుదీర్ఘమైన వేసవి రోజులలో హెడ్రోసార్ పసికూనలు త్వరగా పెరిగి పెద్దవుతాయి. 131 00:18:05,043 --> 00:18:09,047 మొదటి ఏడాదికే అవి పెద్ద జంతువులలో సగం వరకూ పెరగగలవు. 132 00:18:11,133 --> 00:18:13,844 ఇప్పుడు మాత్రం, ఈ అగ్నిపర్వత చిత్తడి నేలలు 133 00:18:13,927 --> 00:18:16,889 ఈ భూగ్రహం మీద అత్యంత ఎక్కువ ఉత్పాదన అందించే ప్రదేశాలు. 134 00:18:19,850 --> 00:18:21,393 భూమి ఉపరితలంలోనూ, నీటి అడుగున కూడా... 135 00:18:23,520 --> 00:18:26,523 సమృద్ధిగా ఆహారం అందించే ప్రదేశం ఇది. 136 00:18:28,567 --> 00:18:33,488 కానీ ఈ ఉత్పాదకతే హెడ్రోసార్స్ కి సమస్యలు కూడా సృష్టించగలదు. 137 00:18:35,532 --> 00:18:39,995 వెచ్చని, లోతు లేని నీటి కొలనులు 138 00:18:40,078 --> 00:18:42,331 దోమలకు చక్కని సంతానోత్పత్తి ప్రదేశాలు. 139 00:18:48,086 --> 00:18:53,008 ప్రతి సంవత్సం, ఈ స్వర్గధామం ప్రత్యక్ష నరకంగా మారిపోతుంటుంది. 140 00:18:56,386 --> 00:18:59,723 హెడ్రోసార్స్ ఆశ్చర్యకరంగా పల్చని చర్మం కలిగి ఉంటాయి, 141 00:18:59,806 --> 00:19:03,769 అందువల్ల, రక్తం పీల్చే దోమల నుంచి వాటికి రక్షణ కరవవుతుంది. 142 00:19:10,609 --> 00:19:12,945 నిరంతరం దోమలు చిరాకు పెడుతుండటంతో ఆహారం తినడం కష్టమవుతుంది, 143 00:19:13,028 --> 00:19:15,531 ఫలితంగా అవి తీవ్రంగా బలహీనపడిపోతాయి. 144 00:19:17,074 --> 00:19:21,703 పసికూనల ప్రాణానికే ప్రమాదం కలిగే స్థాయిలో రక్తాన్ని కోల్పోవచ్చు. 145 00:19:27,709 --> 00:19:32,047 ఈ దోమల దాడి నుండి తప్పించుకునేందుకు ఈ గుంపు తరలిపోవలసి వస్తుంది. 146 00:19:37,344 --> 00:19:40,889 పసికూనలు గనుక వాటితో పాటు రాలేకపోతే, తల్లులు వాటిని విడిచి పెట్టేస్తాయి. 147 00:20:02,536 --> 00:20:07,499 అవి ఎత్తయిన ప్రాంతాలకు వెళుతున్న కొద్దీ, బలమైన గాలులు కొంత ఉపశమనాన్ని అందిస్తాయి. 148 00:20:09,585 --> 00:20:13,005 కానీ అంతదూరం నడిచి వెళ్లగలిగే జంతువులకు మాత్రమే ఆ సౌకర్యం లభిస్తుంది. 149 00:20:26,059 --> 00:20:32,274 హెడ్రోసార్ పిల్లలు వందల్లో పుడితే, తొలి ఏడాదిలో పదిలో ఒక్కటి మాత్రమే జీవించగలుగుతుంది. 150 00:20:34,735 --> 00:20:38,947 కానీ అలా బతకగలిగిన పసికూనలు పెరిగి పెద్దవడానికి మంచి అవకాశాలు ఉంటాయి. 151 00:21:10,145 --> 00:21:12,898 ఈ అగ్నిపర్వత ప్రాంతంలో గుడ్లు పెట్టడం ద్వారా, 152 00:21:12,981 --> 00:21:17,486 తల్లిదండ్రులైన జంతువులు తమ పిల్లలకు జీవితపు మంచి శుభారంభాన్ని ఇస్తాయి. 153 00:21:22,533 --> 00:21:27,204 ధ్రువ ప్రాంతాలలో తక్కువగానూ, వెచ్చగానూ ఉండే వేసవి ఎంతో ఆహారాన్ని అందించినా, 154 00:21:27,788 --> 00:21:30,123 ఆ కాలం ఎన్నో కష్టాలను కూడా తెస్తుంది. 155 00:21:33,418 --> 00:21:37,714 వెచ్చని గాలులు ఆకాశంలోకి చేరుకుని విద్యుత్ శక్తిగా మారతాయి. 156 00:21:39,800 --> 00:21:44,012 ఫలితంగా తరచుగా ఉరుములు, మెరుపులతో కూడిన బీభత్సమైన తుపానులు ఏర్పడతాయి. 157 00:21:54,231 --> 00:21:55,899 ఉత్తర అమెరికాలో, 158 00:21:55,983 --> 00:21:59,570 నిరంతరం సూర్య కిరణాలు ప్రసరించడం వల్ల ఏపుగా పెరిగిన పచ్చని చెట్లు 159 00:21:59,653 --> 00:22:02,364 ఇప్పుడు మండే కట్టెలుగా మారిపోతున్నాయి. 160 00:22:10,706 --> 00:22:13,584 ఈ మంటలకు చాలా జంతువులు పారిపోతున్నాయి. 161 00:22:15,002 --> 00:22:18,380 కానీ కొన్ని జంతువులకు మాత్రం, ఈ ఘోర అగ్నిప్రమాదం కొత్త అవకాశాలను అందిస్తోంది. 162 00:22:23,802 --> 00:22:27,472 ఈ ఆరు అడుగుల డైనోసార్, ట్రూడాంటిడ్, 163 00:22:27,556 --> 00:22:30,726 థెరోపాడ్ జాతికి చెందిన చిన్న జంతువులలో ఒకటి. 164 00:22:42,946 --> 00:22:47,868 పొగ కమ్మి అంతా చీకటిగా ఉన్నా కూడా దాని పెద్ద కళ్లు, మంచి దృష్టిని ఇస్తాయి. 165 00:22:49,369 --> 00:22:53,457 దాని పరిమాణానికి, దానికి ఉన్న మెదడు ఈ భూమి మీద ఏ జీవరాశి మెదడు కన్నా పెద్దది. 166 00:22:58,921 --> 00:23:05,010 ఆర్కిటిక్ ఖండంలోనే అత్యంత తెలివైన, పరిస్థితులకు అనుకూలంగా మారిపోగల, విజయవంతమైన వేట జంతువు ఇదే. 167 00:23:15,896 --> 00:23:17,689 ఈ మంటల అంచున, 168 00:23:17,773 --> 00:23:22,486 తప్పించుకోవడానికి ప్రయత్నించే జంతువులను వేటాడటానికి ట్రూడాంటిడ్స్ సిద్ధమవుతాయి. 169 00:23:31,411 --> 00:23:35,374 మంటలు ఎంతగా వ్యాపిస్తే అన్ని అవకాశాలను 170 00:23:35,457 --> 00:23:38,585 అత్యంత తెలివైన ఈ ఆర్కిటిక్ వేట జంతువు అంది పుచ్చుకుంటుంది. 171 00:24:10,200 --> 00:24:11,243 విజయం. 172 00:24:26,758 --> 00:24:28,677 తక్కువ సమయపు వేసవి కాలం పూర్తి కాగానే, 173 00:24:28,760 --> 00:24:34,057 వేసవి మంటలను తట్టుకుని నిలిచిన అడవులు ఇప్పుడు రంగులు మార్చుకుంటాయి. 174 00:24:40,355 --> 00:24:45,319 మళ్లీ చీకటి రోజులు ప్రారంభం కావడానికి ముందు ఇదే శరత్కాలపు చివరి విరబూత. 175 00:24:54,453 --> 00:24:58,916 అంటార్కిటిక్ ధ్రువ ప్రాంతంలో, వేసవి కాలంలో కూడా 176 00:24:58,999 --> 00:25:00,834 అత్యంత ఎత్తయిన పర్వతాలు మంచుతో కప్పబడి ఉంటాయి. 177 00:25:03,212 --> 00:25:09,301 ఇక ఇప్పుడు, ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టి పగటి నిడివి తగ్గిపోవడంతో, 178 00:25:09,843 --> 00:25:13,847 ధ్రువ శీతాకాలం ఈ ప్రాంతాన్నంతా మరోమారు ఆవరిస్తోంది. 179 00:25:32,366 --> 00:25:35,577 జంతువులు ఇక ఇప్పుడు శీతాకాలం పునరాగమనానికి సిద్ధపడాలి. 180 00:25:47,798 --> 00:25:52,427 దక్షిణ అర్ధగోళానికి తన సొంతమైన డైనోసార్స్ జాతులు ఉన్నాయి. 181 00:26:00,102 --> 00:26:06,149 యుక్తవయస్సులో ఉన్న ఈ మూడూ ఆకులు భుజించే అంటార్క్టోపెల్టా జంతువులు. 182 00:26:09,945 --> 00:26:14,157 ప్రపంచంలోనే అత్యంత పదునైన ఆయుధాలు కలిగిన జంతువులలో ఇది కూడా ఒకటి. 183 00:26:22,040 --> 00:26:25,043 అయినప్పటికీ, ఈ యువ జంతువులు కలసి ఉంటేనే క్షేమంగా మనుగడ సాగిస్తాయి. 184 00:26:33,218 --> 00:26:34,678 భూగోళపు దక్షిణ భాగంలో ఈ సుదూర ప్రదేశంలో, 185 00:26:34,761 --> 00:26:39,266 ఆ జంతువులు తినే మొక్కలు నెలల తరబడి ఎదగకుండా ఉంటాయి. 186 00:27:04,541 --> 00:27:09,713 శీతాకాలం దగ్గర పడుతున్న కొద్దీ, ఈ యువ జంతువులు ఎక్కువ సమయం విశ్రాంతి తీసుకుంటాయి. 187 00:27:19,806 --> 00:27:24,394 ఒకే చోట కలిసి ఉండటం వల్ల శరీరంలో వేడి తక్కువ ఖర్చయి, దరిమిలా, శక్తి ఆదా అవుతుంది. 188 00:27:27,356 --> 00:27:32,236 వాటి శక్తిమంతమైన అవయవాలతో, అవి శీతాకాలపు గుహను మరింత పెద్దది చేయగలవు. 189 00:27:41,119 --> 00:27:44,581 కానీ అవి తిరిగి వచ్చే ప్రతీసారీ, మరింత పెద్దగా పెరిగి ఉంటాయి. 190 00:27:48,126 --> 00:27:51,547 వాటి స్థావరం కొద్దిగా చిన్నది అయినట్లు అనిపిస్తుంది, 191 00:27:52,840 --> 00:27:58,220 దానితో వాటి మధ్య ఉండే సోదర బంధం క్రమంగా తగ్గుముఖం పట్టడం మొదలవుతోంది. 192 00:28:15,362 --> 00:28:19,533 ఎదిగే ప్రతి జంతువుకీ, ఇది చాలా ఆపత్కాలం. 193 00:28:24,538 --> 00:28:27,416 అవి వేరు పడి, తమ సొంత సరిహద్దులు ఏర్పాటు చేసుకునే దిశగా 194 00:28:27,499 --> 00:28:33,338 తొలి అడుగులు వేయడానికీ సమయం ఆసన్నమయింది. 195 00:28:50,105 --> 00:28:54,401 హెడ్రోసార్స్ గుంపులు మళ్లీ ప్రయాణం ప్రారంభించాయి. 196 00:28:58,071 --> 00:29:01,867 ఇక్కడ తినడానికి ఆహారం సరిపడా లేక, వృక్ష సంపద మీద ఆధారపడి జీవించే 197 00:29:01,950 --> 00:29:05,162 ఈ భారీ జంతువులు ఇతర వేడి ప్రదేశాలలో ఆహారం కోసం వెతుక్కుంటూ బయలుదేరాయి... 198 00:29:13,670 --> 00:29:18,383 ధ్రువ శీతాకాలపు గడ్డ కట్టే చలికి మిగతా జంతువులు బలి కాబోతున్నాయి. 199 00:29:32,481 --> 00:29:34,316 తమకు అనుకూలమైన భూభాగం కోసం అన్వేషిస్తూ 200 00:29:34,399 --> 00:29:38,195 ఈ జంతువులు తాము పుట్టి పెరిగిన ప్రదేశాలను వదిలి సుదూర ప్రాంతాలకు తరలి వెళతాయి. 201 00:29:39,988 --> 00:29:43,492 ఆ అన్వేషించే క్రమంలో చాలా జంతువులు ప్రాణాలు కోల్పోతాయి. 202 00:29:55,379 --> 00:29:59,424 ఒక మంచి భూభాగం అంటే ఆ జంతువు నివసించడానికి నీడ ఇవ్వాలి. 203 00:30:02,010 --> 00:30:03,762 ఒక గుహ కావచ్చు. 204 00:30:11,854 --> 00:30:14,273 విపరీతమైన చలి ఉండే నెలల్లో కూడా, 205 00:30:14,356 --> 00:30:17,818 గుహలలోని ఉష్ణోగ్రతలలో పెద్దగా మార్పు ఉండదు. 206 00:30:21,655 --> 00:30:25,409 అయితే ఈ గుహ పట్ల ఆకర్షితురాలైన జంతువు ఇది ఒక్కటే కాదు. 207 00:30:30,372 --> 00:30:33,083 ఈ గుహ వెలుగులీనుతోంది. 208 00:30:46,763 --> 00:30:51,476 ఫంగస్ గ్నాట్ లార్వా అనబడు ఈ చిన్న చిన్న మిణుగురులు 209 00:30:51,560 --> 00:30:55,355 కాంతిని వెదజల్లుతూ తమకు ఆహారమైన కీటకాలను ఆకర్షిస్తాయి. 210 00:31:09,536 --> 00:31:11,455 గడ్డ కట్టించే ఈ శీతాకాలపు చలి నుంచి తప్పించుకోవడానికి 211 00:31:11,538 --> 00:31:16,043 అంటార్క్టోపెల్టాకి ఇది చక్కని స్థావరం. 212 00:31:18,003 --> 00:31:22,883 ఈ విచిత్రమైన జీవమున్న నక్షత్రాల కింద ఈ జంతువు సురక్షితంగా ఉంటుంది... 213 00:31:24,551 --> 00:31:29,097 బయట, మంచు కురువడం మొదలవుతుంది. 214 00:31:39,024 --> 00:31:43,695 అతి శీతల మాసాలలో, ఆర్కిటిక్ ఖండం ఉత్తరం అంచున ఉన్న ప్రాంతాలు 215 00:31:43,779 --> 00:31:47,199 మంచుతో కప్పబడి శీతాకాలపు అద్భుతలోకంగా మనోహరంగా మారిపోతాయి. 216 00:31:50,327 --> 00:31:54,831 అన్ని డైనోసార్స్ ఈ నేలను వదిలివెళ్లవు లేదా మరొక చోట ఆశ్రయం పొందవు. 217 00:31:56,291 --> 00:31:59,503 అతి పెద్ద డైనోసార్స్ కు ఈ వాతావరణాన్ని తట్టుకునే శక్తి ఉంటుంది. 218 00:32:03,173 --> 00:32:05,384 ప్యాకిరైనోసార్స్. 219 00:32:06,552 --> 00:32:11,390 రెండు టన్నుల బరువున్న ఈ శాకాహార జంతువులు తలలకు భారీ కవచాలను కలిగి ఉంటాయి. 220 00:32:12,724 --> 00:32:15,060 అవి అడవిలో ఆశ్రయం పొంది, 221 00:32:15,143 --> 00:32:18,105 మంచు కప్పిన చెట్ల చిగుళ్లనూ 222 00:32:18,188 --> 00:32:20,899 కొమ్మల అంచులలో చిక్కుకునే పండ్లనూ తింటూ కాలం గడుపుతుంటాయి. 223 00:32:25,404 --> 00:32:27,155 శరత్కాలంలో జత కూడటం ముగిసినా కూడా, 224 00:32:29,283 --> 00:32:34,663 అంతగా ఆధిపత్యం లేని మగ జంతువులు తమ ప్రతాపం చాటుకోవడానికి తెగబడుతూ ఉంటాయి. 225 00:32:36,582 --> 00:32:38,876 కానీ తమ గుంపునకు ఒక నాయకుడు ఉన్న సంగతిని అవి మర్చిపోయాయి. 226 00:32:46,216 --> 00:32:50,220 ఈ వృద్ధ జంతువు ఇప్పటికీ ఎదురులేని శక్తిగా ఉండటం వల్ల 227 00:32:50,304 --> 00:32:52,639 మిగతా జంతువులు దానితో తలపడటానికి సాహసించవు. 228 00:33:01,565 --> 00:33:05,861 పోరాటాలు చేసే మగ జంతువులకు తినడానికీ లేదా విశ్రాంతికీ సమయం సరిపోదు. 229 00:33:07,070 --> 00:33:11,617 ఇక ఇప్పుడు ఆహార కొరత కూడా ఏర్పడటం వల్ల తమ శక్తిని కూడదీసుకోవడం కష్టం అవుతుంది, 230 00:33:11,700 --> 00:33:14,077 అలాగే వాటి గాయాలు మానడానికి సమయం పడుతుంది. 231 00:33:17,706 --> 00:33:19,333 ఈ పరిస్థితులను మరింత కఠినతరం చేస్తూ... 232 00:33:21,960 --> 00:33:27,382 ఆర్కిటిక్ ఖండపు అత్యంత శక్తిమంతమైన వేట జంతువు నిత్యం షికారు చేస్తూనే ఉంటుంది. 233 00:33:39,561 --> 00:33:41,605 ననూక్సారస్. 234 00:33:45,234 --> 00:33:47,861 ఇది టి. రెక్స్ కి చిన్న బంధువు, 235 00:33:47,945 --> 00:33:51,949 అయినప్పటికీ ప్యాకిరైనోసార్ ని మట్టి కరిపించేంత పెద్ద జంతువే. 236 00:34:01,834 --> 00:34:05,712 ఈ వాతావరణంలో ప్రాచీన శత్రువులైన ఈ రెండు జంతువులు తలపడినప్పుడు, 237 00:34:05,796 --> 00:34:11,760 ఆ యుద్ధం హఠాత్తుగా దాడి చేయడం వల్ల కాకుండా, కేవలం వ్యూహం ద్వారా మాత్రమే పరిష్కారం అవుతుంది. 238 00:34:26,775 --> 00:34:30,821 ఈ చెట్ల మధ్యలో ప్యాకిరైనోసార్స్ గుంపు ఒక్కటిగా నిలవడం కష్టం. 239 00:34:32,197 --> 00:34:34,867 ఈ జంతువులను ఒక్కొక్కటిగా లక్ష్యంగా చేసుకోవచ్చు. 240 00:34:38,996 --> 00:34:45,918 అందుకే భయంతో ఈ గుంపు వ్యూహాత్మకంగా వెనక్కి తగ్గి బహిరంగ ప్రదేశానికి తరలి వెళుతుంది. 241 00:34:48,922 --> 00:34:51,049 ననూక్సార్స్ వాటిని అనుసరిస్తాయి. 242 00:35:13,947 --> 00:35:18,827 ఈ ప్రదేశంలో, ఈ గుంపు యుద్ధానికి సిద్ధమయి 243 00:35:18,911 --> 00:35:24,333 తమ తలలకు ఉన్న కవచాలను, కండలను అడ్డు పెట్టి ఛేదించలేని ఒక గోడలా అవి మారాయి. 244 00:35:40,432 --> 00:35:42,643 మంచు తుఫాను మరింత ముదిరింది. 245 00:35:47,147 --> 00:35:48,982 ఇది ఒక ఇబ్బందికరమైన ప్రతిష్టంభన. 246 00:35:51,443 --> 00:35:54,780 ఈ ఘర్షణలు కొద్ది రోజుల పాటు కొనసాగుతాయి. 247 00:36:11,588 --> 00:36:15,300 ఆ గుంపు ఒక్కటిగా సమష్టిగా ఉన్నంత సేపు అవి క్షేమంగా ఉంటాయి. 248 00:36:18,720 --> 00:36:21,974 కానీ ననూక్సార్స్ అదను కోసం వేచి ఉంటాయి... 249 00:36:24,184 --> 00:36:27,479 మధ్యమధ్యలో శత్రువులు బలహీనంగా ఉన్నారా లేదా అని పరీక్షిస్తాయి. 250 00:36:42,494 --> 00:36:45,581 మంచు తుఫాను ఇప్పుడు ఈ యుద్ధాన్ని కొద్దిసేపు ఆపుతుంది. 251 00:37:07,352 --> 00:37:13,901 కానీ తుఫాను ముగిసిన వెంటనే, యుద్ధం మళ్లీ ప్రారంభమవుతుంది. 252 00:37:21,783 --> 00:37:23,744 సత్తాను చాటాల్సిన ఈ సమయంలో, 253 00:37:24,453 --> 00:37:28,123 చేయవలసిందల్లా ఒక జంతువు వెళ్లి శత్రువు కోటని ఛేదించడమే... 254 00:37:30,667 --> 00:37:33,837 దానితో గుంపులో హఠాత్తుగా కంగారు మొదలవుతుంది. 255 00:37:38,842 --> 00:37:42,513 ఆ గుంపు పారిపోవడానికి ప్రయత్నిస్తుంటే, వేట జంతువులకు అవకాశం ఊరిస్తోంది. 256 00:37:54,858 --> 00:37:56,568 ఈ వేట జంతువులు వెంటాడుతుండగా, 257 00:37:56,652 --> 00:38:00,489 అలసిపోయిన ఒక ప్యాకిరైనోసార్ తమ గుంపును అందుకోలేకపోతోంది. 258 00:38:05,661 --> 00:38:11,500 ఇక చివరికి అది చేయగలిగిందల్లా వెనుకకు తిరిగి తన శత్రువులను ఎదుర్కోవడమే. 259 00:38:33,647 --> 00:38:37,651 ఒక ప్యాకిరైనోసార్ యుద్ధంలో ఓడిపోయింది. 260 00:38:41,864 --> 00:38:44,950 కానీ ఈ యుద్ధం ఈ శీతాకాలం అంతా కొనసాగుతుంది. 261 00:38:50,122 --> 00:38:53,083 ఇక్కడి జంతువులు ఇక కొద్ది నెలల పాటు పూర్తిగా చీకటి రోజులను చవిచూస్తాయి 262 00:38:53,166 --> 00:38:58,714 ఆ తరువాత సూర్యుడు తిరిగి రావడంతో ఈ అసాధారణ జంతువులకు 263 00:39:00,215 --> 00:39:02,926 ఈ మంచు ప్రపంచంలో తిరిగి ఉపశమనం లభిస్తుంది. 264 00:39:11,810 --> 00:39:13,770 తరువాయి భాగంలో, 265 00:39:13,854 --> 00:39:17,983 జిరాఫీ పరిమాణం అంత పెద్ద ఎగిరే పక్షి 266 00:39:18,066 --> 00:39:21,695 చరిత్రపూర్వ యుగపు అడవుల్లో దట్టమైన చెట్ల మధ్య తన ఆహారాన్ని వేటాడుతుంది. 267 00:39:22,988 --> 00:39:25,532 ఈ గ్రహం మీద ఆకుపచ్చని పందిరి కింద 268 00:39:25,616 --> 00:39:31,246 డైనోసార్స్ మెరుపుదాడులు చేస్తాయి, తమ సత్తా ప్రదర్శిస్తాయి ఇంకా భూగర్భాలలో కూడా విహరిస్తాయి. 269 00:39:31,330 --> 00:39:34,416 కథల వెనుక శాస్త్రీయ మర్మాలని తెలుసుకోవడానికి, 270 00:39:34,499 --> 00:39:38,921 మా షో వెబ్ పేజీని చూడండి. 271 00:41:06,967 --> 00:41:08,969 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్